సంపాదకీయము
- 21.2 - 142 L.E. (2014)
|
పూజ్య బాబూజీ గారి జన్మదినము ప్రతి ఏటా మనం జరుపుకొనే విశేషమే.
జయ నామ సంత్సరములో 19 April ప్రత్యేకంగా మనకు ఆది, అనాది యితడే
యన్నభావనను స్ఫురింపచేస్తుంది. ధ్యానమునే నమ్మిసాధన చేసే వారు
కొందరు. గురుశిష్యుల సంబంధమునెరిగి భగవత్ మరియు భాగవత
సేవలోయుండే వారు కొందరు. అందరూ గురు ప్రేమకు అర్హులే.
కైంకర్యము ఓ నిష్ఠ. మనకు అన్నీ యుండి భాగవత్కైకర్యమునకు
అవకాశముండదో మనకంటే దరిద్రులుండరు. అవకాశముండి దానిని
వినియోగించు కొనని వారు ధుర్భాగ్యులు, శాపగ్రస్థులు,
నిరుపేదలు. అందువలనే వరదాచారి గారు “Real poverty is lack of
God- service.” అన్నారు. మనకు విహితములగు ధర్మములనాచారించిచూ
కర్మఫలాపేక్ష లేకుండా వాటిని భగవధారాధనగా భావించే వారు కొందరు.
స్థూలంగా చెప్పుకొంటే యిది భరతుని పద్ధతి. మనకు విహితములయిన
కర్మలనుకూడ వర్జించి సాక్షాత్తు గురు కైంకర్యమే జీవన పరమావధిగా
గురు సాంగత్యమునే ఎల్లవేళలా కోరుతూ యుండేవారు రామానుజ పద్ధతిని
స్వీకరించిన వారు. వీటిలో ఏది యుత్తమమో నిర్దారించబూనుట అతి
సాహసమే భౌతికంగా సంయోగము సాధ్యమేగాని సాయుజ్యం వీలు పడదు.
సామీప్య, సాలోక సాయుజ్య స్థితులు చైతన్య ఆరామాలు. భావ
సాయుజ్యమే యోగాభ్యాస లక్ష్యము. మన లక్ష్యం శ్రీ రామ చైతన్యంతో
ఐక్యమవడమే. శ్రీరామ చైతన్యము అనాది. దాని ఎల్లలు మన ఊహకందనిది.
అయినా మనము దాని రుచిని ప్రతి దినము అనుభవిస్తున్నా మంటే యది
ప్రాణాహూతి మహిమే.
కే.సి.నారాయణ
18-04-2014
|
|