IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 21.1 - 142 L.E. (2014)

  

పూజ్య లాలాజీ శకం ప్రారంభమయి 142 సంవత్సరములు గడచింది. మానవుని లో ఏదైనా మార్పు వచ్చిందాయని ఆత్మావలోకనం చేసుకుంటే అంతా మృగతృష్ణే. కాలానుగుణంగా కొన్ని మార్పులూ చేర్పులూ జరిగినదీ కాదనులేము. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం అస్తమించింది. ప్రజావాక్యం చలామణి కావడం జరుగుతున్నది. ఈ శకంలో రెండు ప్రపంచ యుద్దాలూ, చిన్నాచితకా యుద్దాలూ జరుగుతూనే యున్నాయి. ఇవికాక కొన్ని రావణకాష్టా తగలడుతూనే యున్నాయి. అంతా భౌతిక ప్రగతి తప్ప ఆధ్యాత్మికత ఎచటా కానరాదు. మతమే ఆధ్యాత్మికంగా చలామణి యవుతున్నది. వర్ణాలకతీతంగా, శబ్దాలకావల అనుభవించవలసిన పరతత్వము భౌతికంగా దిగజార్చి తానతందానాలతో, రంగుల ఇంద్రధనస్సుమధ్య మురిసి పోతూ అదే ఆనందమనే భ్రమలోయున్న భ్రష్ట సమాజంలోకి దూసుకుపోతున్న తరుణమిది. నిమ్నాస్థాయి భావాలనుంచి మనదైన నిజసహజస్థితి ఎంత సులభముగా పొందవచ్చునో మన గురు దేవులు మనకు తెలిపియున్నారు. వాటిని పాటించి ఎంతోకొంత ప్రగతిని మనం సాధిస్తున్నాము కూడా. పోయిన శాతాబ్దాంతు తరువాత మనం అనుభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, మానవ పైశాచికాలూ సామాన్యమానవులను భీరువులగా ప్రవర్తింపచేస్తుంది. పూజ్య గురుదేవద్వయము యొక్క కృపవిశేషము వలన మనము స్థిరచిత్తము కలిగి ధృఢసంకల్పముతో సత్య పధములో సాగిపోతున్నాము. మన గమ్యం మనకు తెలుసు. మనతోడెవరో మనకెరుకే. మార్గములో పయనించడము మన వంతు, అతనిలో లీనంచేసుకోవడమాతని వంతు.

తథాస్తు.

కే.సి. నారాయణ.