సంపాదకీయము
- 20.4 - 141 L.E. (2013)
|
దీపావళియంటే
అందరికీ సంబరమే. ప్రత్యేకంగా యోగము చేసేవరు శ్రీ కృష్ణ పరమాత్మ
యనుగ్రహము కొరకు వేచియుంటారు. అంతర్జ్యోతి యనేది అంతరాళమున
మిణుకు, మిణుకు మనే కాంతి కాదు. అది అమేయము, కృష్ణానుఖ్యమయిన
కాంతి లేని కాంతి. గురుకృప లేనిదే జగస్సత్యము గోచరింపదు. ఈ
కాంతి పలు వర్ణములలో మన ప్రగతి ననుసరించి స్వచ్చమయిన తెలుపు
నుండి పసుపు, ఎరుపు, పచ్చ, ఊదారంగుల ద్వారా గోచరించి మన
అంతరాళములో చెరుగని ముద్రవేసి మన జీవన విధానమునే మార్చి
వేస్తున్నదని మనయనుభవము. ఎప్పుడైతే ఈ వర్ణక్రీడకు మనము యలవాటు
పడుతామో సౌందర్య లహరిలో ఓలలాడడము మన సహజ స్తితి యవుతుంది.
అట్టి దశలో ప్రతిరోజూ నిత్య చైతన్య దీపావళి.
దీపావళి
శుభాకాంక్షలు. కే.సి.నారాయణ.
|
|