సంపాదకీయము
- 20.2 - 141 L.E. (2013)
|
విజయ నామ సంవత్సరములో, మన పూజ్య బాబూజీగారి 114వ జన్మదిన
వేడుకలు యధా విధిగా విచ్చేసింది. మన తరహా వేడుకలు భిన్నమయినది.
బాణాసంచాలు పేలవు. మతాబాలు కాల్చము, మేళతాళాలుండవు. సతతము
పూజ్య బాబూజీ పట్ల భక్తి తో వినమ్రంగా మౌనంగాయుంటూ లేక
ధ్యానంలోయుంటూ వుండటము లోనే మన ఆనందమూ, వేడుకయూనూ. అయినా
మనంకోరుకొన్న ప్రశాంతతను భంగ పరుస్తూ ఏదో తెలియని భావ
సంఘర్షణలు. వాటికి ఎన్ని రంగులో, కాస్తంత ఎడం దొరకగానే ఒక
దానినొకటి త్రోసుకొంటూ మన మనస్సును ఆక్రమించే ప్రయత్నం చేస్తూ
రామచంద్ర చైతన్య స్రవంతిని అడ్డుకొని కలిచివేసే ప్రయత్నము
చేస్తుంటాయి. మన దృష్టిని మరల్చితిమా గురు కృపయొక్కటే తిరిగి
మనలను శుద్ద చైతన్యము వైపు ఆకర్షించ గలదు. మానవాభ్యుదయానికై
అవతరించిన యుగపురుషుని జయంతి మనకొసగు అవకాశము సోదరులు
సద్వినియోగ పరచకోగలరని ఆశిస్తూ.
గురు సేవలోభవదీయుడు
కే.సి. నారాయణ |
|