IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 19.4 - 140 L.E. (2012)

  

శ్రీ కృష్ణుని స్మరిస్తూ ఆటపాటలతో గడిపే దినాలలో దీపావళి ఒకటి. నేను అందరి గుండెలలో నిరంతరము చిరువెలుగైయున్నానని పరమాత్మ తన గీతలో స్పష్టముగా తెలిపియున్నాడు. మనలోయున్న తన్ను తెలుసుకొనుటమే మన ధ్యేయమన్నాడు. ఆయన యోగ మార్గములో, యోగులెరిగిన విధంగా భక్తిని ప్రవేశపెట్టారని మన పూజ్య బాబూజీ గారు మనకు తెలియచెప్పినారు. మనము ప్రేమ, భక్తి అందరిలో పెరుగు నటుల మెలగవలెనని మనలనాదేశించినారు. సాధకులెరుగవలసిన ముఖ్య విషయ మేమంటే మనలో ప్రేమ ఆందరి ఎడలా పెరగేటట్లు చేయడము మన ప్రాధమిక కర్తవ్యము. ప్రేమయనేదొక బంధము, భక్తి యనేదొక అర్పణము. మన సాధనా పద్దతిలో ప్రేమయనేది రెండవగ్రంధిలోని స్థితి. ఇది, ఇంతై, ఇంతింతై మరింతై, వసుధయంతై, భూలోకమంతయై, పద్నాలుగు భువనమంతై యునికి సున్నై నపుడు భక్తికి మొదటి మెట్టుపై పట్టుదొరికినపుడు గరుడధ్వజము రెపరెపలాడుతూ మన సాధన భగవధ్బక్తిగా రూపాంతర మవుతుంది. అలా జరగాలనే మనందరి ప్రార్థన.

కే.సి. నారాయణ. 5-11-2012