సంపాదకీయము
- 19.3 - 140 L.E. (2012)
|
శ్రీ
కృష్ణాష్టమి అంటేనే మనలో ఏదో ఆనందం. ప్రేమస్వరూపుడయిన వారి
తలంపు మనలో దివ్య చైతన్యాన్ని ప్రజ్వలింపచేస్తుంది. ఏదో
తెలియని ఆనందం. ఇతరుల మాటేలాయున్నా మన పూజ్య బాబూజీలో కృష్ణుడు
లయమయినందున మనకు వారిరివురి తలంపు అపరిమిత ఆనందమే మనకు
కలుగుతుంది. కృష్ణని ప్రేమ రాసక్రీడ- అదోస్దాయి- ఆట,
పాట-దొంగాట-దోబూచులాట. అదో కృష్ణ విలాసము- కృష్ణ ప్రేమికుల
విరహతాపము. పూజ్య బాబూజీ గారి ప్రేమ నిరంతర సుధా ధార యని
సాధకులకు తెలుసు. కోరినప్పుడెల్లా ప్రాణాహూతి మన ఆధ్యాత్మిక
స్దాయి బట్టి మనకు కలిగే దివ్యానందము. ప్రాణాహూతిలో
దోబూచలాటలేదు. అది నిష్కల్మషమయిన, పరిపూర్ణ ఆనందహేల. అదో ఆనంద
లహరి. ప్రాణాహూతి దివ్యమయి. అది అవిచ్ఛమయిన ప్రేమ తైల ధార.
అనుభవించడము మన వంతు. నిరంతరమూ పంచడము పూజ్య బాబూజీ గారి వంతు.
శుభమస్తు.
10-08-2012
కే.సి. నారాయణ. |
|