సంపాదకీయము
- 19.1 - 140 L.E. (2012)
|
మనకు అను దిన స్మరణీయుడైన పూజ్య లాలాజీ గారి జన్మదినము వసంత
పంచమి. అదే రోజు సరస్వతి పండుగ జరుపుకోవడము హిందూ సాంప్రదాయము.
సరస్వతి అంటే స్వసారమును (swa=self
; sara=essence)
తెలిపే అధిష్ఠాన దైవము. వేదార్ధములను అనుగ్రహించే దైవము.
వేదాలకు పలువురు వ్యాఖ్యానాలు రచించినారు. కాని వేదాల
వెనుకయున్న గూఢార్ధమును వివరించి మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
ప్రసాదించినది మన పూజ్య లాలాజీ గారే. సరస్వతి దేవిగారి నాలుగు
చేతులు బుద్ధి, చిత్తము, ఏకాగ్రత, కార్య దీక్షల ననుగ్రహించే
గుణములకు సంకేతము. ఈ నాలుగు సంపూర్ణముగా శుద్ది గాక బ్రహ్మ
జ్ఞానము వికసించదు. ఈ బహు ఓరిమి కష్టములతో గాని సాధ్యమవని
దానిని తన దివ్యమైన ప్రాణాహూతి ద్వారా సుసాధ్యము గావించిన మన
ఆది గురువు మనకు సర్వత్రా, సర్వదా రక్షకుడు. సర్వ
వేదార్ధములను, సర్వ శాస్త్ర సారమును, సర్వ ధర్మములను ఎరిగి
కరతలామలకము గా మనకు అందించిన పుంభావ సరస్వతి, మన ప్రియతమ
లాలాజీ గారు. తన తదనంతరం మనకు తన ఆధ్యాత్మిక వారసునిగా పూజ్య
బాబూజీ గారిని తీర్చిదిద్ది అందించిన దొడ్డ ప్రేమ మూర్తి మన
లాలాజీ.గారు మనము చేరవలసిన గమ్యము
సచ్చిదానందస్వరూపములకావలయున్న పూర్ణ శూన్యత్వ స్వరూపుడగు
లాలాజీ కాగా మనలను అద్దరికి చేర్చు ఉపాయము మన పూజ్య బాబూజీ
గారే. ఉపాయ నిర్ణయము ఎవరికి వారు చేసుకొనవలసిన విషయము.
రక్షకుడు పూజ్య లాలాజీయైనా మన శిక్షకుడు మన ప్రియతమ బాబూజీ
గారే. అందరూ వారి దివ్యాశీస్సులను పొందాలని ప్రార్థిస్తూ.
బసంత్ పంచమి లా.శ.
140
కే.సి. నారాయణ. |
|