సంపాదకీయము
- 18.3 - 139 L.E. (2011)
|
శ్రీకృష్ణుని తలంపు అభ్యాసి సోదర సోదరీ మణులకు నిరంతర భావ
మధురిమ.
అదో భావ లహరి.
నీలి నీడలతో మనలనుర్రూతలూగించే ధ్యాన విలాసము.
అంబరమంతా నెమలి కంటి నీల వర్ణ శోభ.
అంతలోనే అన్నీయంతరించి శ్రీ రామచంద్ర చైతన్య బిగువు.
ఇది మనయనుచరుల నిత్యానుభవము.
శ్రీ కృష్ణుడు ఆనంద ప్రదాత.
పూజ్య బాబూజీ ఆనందాతీతమయిన స్థాయి ప్రదాత.
ఇది సంపూర్ణ సారము.
ఇరువురు లేని,
ఒక్కరు కాని,
ఇరుకైన బంధము.
శ్రీ కృష్ణుని పై ధ్యానము మనకు నిలకడగాయుండక భావాతీతము వైపు
ప్రస్థానము గావించుటకు కారణము పూజ్య బాబూజీగారి అనుగ్రహమేనని
యెరుగుటకు వారిరివురి కృపా విశేషమే హేతువు.
శ్రీ కృష్ణుని ప్రేమ సందర్భానుసారంగా సత్వ,
రజస్సు,
తమస్సులుగా విరాజిల్లుతుండేది.
పూజ్య బాబూజీగారి ప్రేమ అందరికి,
అన్నివేళలా త్రి గుణాత్మకానికి అతీతంగా యుంటుందనేది మనయనుభవము.
శ్రీ రామచంద్ర చైతన్యంలో ఎల్లప్పుడూ శ్రీ కృష్ణ చైతన్యంలో
కలిసేయుంటుంది.
అదే గంగా జామునీయని పూజ్య బాబూజీయనేవారు.
ఆ ప్రవాహము మనజీవనసారమని వేరే చెప్పనక్కరలేదు.
శ్రీ కృష్ణ జయంతి,
2011.
కే.సి.నారాయణ |
|