IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 18.2 - 139 L.E. (2011)

  

శ్రీ కృష్ణ శ్రీ రామచంద్ర మిళితావతారియు, ప్రాణాహూతి ప్రదాతయు యగు శ్రీ రామచంద్రజీ మహరాజ్ , మనందరి హృదయాలలో కొలువుండి మనకందించు ఆనందం వర్ణించలేము. అట్టి మన ప్రియతమ పూజ్య బాబూజీ గారి జన్మదినము మళ్ళీ వచ్చింది. సద్గురువులే కరువైన నాడు, జగద్గురువు నేనున్నానంటూ మన హృదయాలలో చేరి నిరంతరము మనలను వారు సద్గతివైపు నడిపించుచున్నారంటే మనది అతిశయోక్తియని ఇతరులనుకొంటే అది వారి పొరబాటు కాదు. అది మన భాగ్యము. అయినా మనలో కొందరికి ఏదో అసంతృప్తి. తృప్తి లేనిదే జీవితము దుర్భరము. సతతము దైవస్మరణే ధ్యేయముగా నున్న సంతృప్తి సులభము. మరియూ అనసూయాత్మలకూ ఇది సహజ గుణము. మానవ ఆధ్యాత్మిక జీవనము బహు దొడ్డది. మనందరము బహుదూరపు బాటసారులము. మన దృష్టి నిరంతరము ధ్యేయముపై యుండవలసియున్నా ప్రక్క చూపులు, ఓరచూపులూ చంచలాత్ములకు సహజము. అవే అసంతృప్తికి కారణము. మన దృష్టి మన ప్రియతమ గురువుగారిపైన యుండాలంటే మన కళ్లకు గంతలు తప్పని సరి. ఏకాగ్రదృష్ఠి సాధనవలన మాత్రమే సాధ్యము. గురువులయెడల నిశ్చలమయిన ప్రేమ గురుమతావలంబన కలుగుటకు గల ఏకైక మార్గము. మనందరము అట్టి మానసిక పక్వత గలిగి యున్నామని నానమ్మకము  తథాస్తు.

బాబూజీ జయంతి. 2011.                                                                                                          

కే.సి.నారాయణ.