మనకు మనో ఆనందాన్ని కల్గించే బసంత పంచమి మళ్ళీ వచ్చింది. శక
కర్త పూజ్య లాలాజీ జన్మించి 139 సంవత్సరములు జరిగినప్పుడుగాని
మనకంటూ వొక కాలమానాన్ని నిర్దేశించే ఆలోచన కార్యరూపం
దాల్చలేదు. ఇకపై మన నెలలను సమవర్తి నెలతో ప్రారంభించి, వరుసగా
ప్రాణ, భూమ, ప్రభు, భన్వర్ , ఈశ్వర్ , వరద, కృష్ణ, సమదృష్టి,
సత్ పద్ , రాధ, వివేకయను నామములతో వ్యవహరించ నిర్ణయించిన
దానిలోయున్న ఔచిత్యాన్ని భవిష్యత్తు గ్రహించగలదుయనే నమ్మకము
మనకుంది. గ్రీకు దేవత జేనస్ తో నామకరణమయిన జనవరి నెలతో
ప్రారంభమయి, రోమన్ చక్రవర్తుల పేర్లతో కొన్ని నెలలు దొర్లే
ఆంగ్ల సాంప్రదాయాన్ని మాని, సకల సద్గుణ సంపన్నుడయిన సమవర్తి
పూజ్య లాలాజీ గారి పేర సంవత్సరాన్ని ప్రారంభించి, సకల చరాచర
ప్రపంచమును నిర్దేశించే మన ప్రభు పూజ్య బాబూజీ పేరయొక నెలను,
మనకు మనదైనయను సంధానాన్ని కల్పించిన పూజ్య వరదునిపేరయొక నెలను,
యుగ పురుషుడు శ్రీ కృష్ణుని పేర మరియొకదానినీ కలిగియుండే
calendar
ను తయ్యారు చేసుకొనే అవకాశము కలిగినందుకు
మనమెంతోయదృష్టవంతులమని నానమ్మకము. ఇల్లు అలకడముతో పండగైపోదు.
శక కర్తయడుగుజాడల్లోయున్నామనే జ్ఞానము మనలను నిరంతరము మానవ
పురోగతివైపు కృషిచేసేలా ప్రోత్సహిస్తూయుండాలి. దీనిని
సాధించడానికి యడ్డుదార్లేవీలేదు. మానవ వ్యక్తిత్వ వికాసం
లేనిదే విశ్వమానవ సౌభ్రాతృత్వము వికసిల్లదు. దైవీ మరియు ఆసురీ
యను ద్వంద్వప్రవృత్తులు మన్లో నిరంతరం సంఘర్షణ పడుతూనే యుండడము
సాధకులమగు మనకు విదితమే. పసిడి పలుకులు పలికే గురువులకు
కొదవేమీ లేదు. అట్టి
“గోరు”
ల బారినుండి విముక్తి కలిగించేటందుకు మనపై కరుణతో ప్రాణాహూతిని
కోరినప్పుడల్లా అందుబాటులో వుంచడానికి తగ్గ పద్ధతిని
మనకనుగ్రహించినందుకు పూజ్య లాలాజీ గారికి శతకోటి వందనములు.
మనలను విశ్వమానవ కల్యాణానికి పరిపూర్ణముగా సమర్పించుకోవడము
మొక్కటే మనమివ్వగల గురు దక్షిణ.
తధాస్తు.
బసంత్ పంచమి.లా.శ.139
కే.సి.నారాయణ |