సంపాదకీయము
- 18.4 - 139 L.E. (2011)
|
శ్రీ కృష్ణుడు అనన్య సామాన్య చతురుడు, వ్యవహారశీలి, కార్య
దక్షుడు. దీపావళి పండుగను స్మరించుకున్నప్పుడు అతని సమ్మోహన
క్రియాతత్వము విశదమవుతుంది. పారిజాతాపహరణముతో ప్రారంభమయిన
శ్రీహరి వినోదము ధరిత్రి తనయుని అంతముతో పదహారువేలు యువతులకు
దాస్య విమోచనము కలుగుతుంది. ఆ యువతులందరూ శ్రీమంతుని మనువాడగోర
వారిని తనలో చేర్చుకొనెనట. ఎంత విడ్డూరమో. సత్య సముఖమున మరో
నారిని వరించుట ఆతని లీలా వినోదము. మరియు సమస్త జీవకోటి
రాశులకు మోక్షమార్గము చూపువానిని కట్టడి చేయు నెవ్వరికి
సాధ్యము కాదని తెలియచెప్పిన ఘట్టము నరక సంహారము. ఏ ఒక్కరి
సొంతము గాడు నరహరి. దైవాంశ సంభూతుడయిన మన గురువు
శ్రీరామచంద్రజీ మహరాజ్ గారు విశ్వ కళ్యాణమునకై అవతరించిన
యుగపురుషుడు. వారు ఏ ఒక్కరికి చెందినవారు గారు, కాని
అందరివాడే. అతని ప్రేమ ఎల్లలెరుగదు. మనమతనిని ప్రేమించగలిగితే
విశ్వ ప్రేమను సాధించినట్లే. తథాస్తు.
దీపావళి,
2011
కే.సి.నారాయణ. |
|